Friday, September 12, 2025 08:59 PM
Friday, September 12, 2025 08:59 PM
roots

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌..!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈసారి సమావేశాలు రెండు నుంచి మూడు వారాలు కొనసాగించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా చూడాలని.. దీంతో, ప్రజా సమస్యలు చర్చకు వస్తాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు కనీసం రెండు వారాలు జరిగే అవకాశం ఉంది. 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 2024లో ఎన్నికలు రావడంతో అంతకముందు ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆరు నెలలకే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తిరిగి 2025-26 ఆర్థిక వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.

Also Read: వైసీపీకి మరో ఎదురు దెబ్బ..?

ఈసారి బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ది సమతుల్యత పాటించడమే కాకుండా విద్య, వైద్య, నీటిపారుదల రంగాలకు పెద్ద పీట వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం ఆయా శాఖలకు బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్‌పై ఆయా శాఖల నుంచి సమాచారం తీసుకున్న అధికార యంత్రాంగం.. ప్రభుత్వానికి నివేదించనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమంతో పాటు ఫీజు రియింబర్స్‌మెంట్‌ను కూడా వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా మంత్రుల కమిటీ ఇప్పటికే కర్ణాటకలో పర్యటించింది. ఆ కమిటి ఇచ్చే నివేదిక ఆధారంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సూపర్ సిక్స్ పథకాలకు నిధులు సమకూర్చుకునేందుకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించనున్నారు.

Also Read :మంత్రులకు సీఎం భయం.. సచివాలయం వదలట్లేదు..!

ఇక, నీటిపారుదల రంగంపై కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుండటంతో ఇప్పటికే డయా ఫ్రం వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. రూ.900 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు గోదావరి నీటిని బనకచర్ల వరకు తీసుకువెళ్లే పథకానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో పాటు పలు కీలక ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. వీటి కోసం నిధులు కేటాయింపు కూడా బడ్జెట్‌లో జరగనుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయ సముపార్జన శాఖల ద్వారా వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులను అంచనా వేసుకొని.. సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్‌తో పాటు హడ్కో, జర్మనీకి చెందిన కె ఎఫ్ డబ్ల్యూ బ్యాంక్ కూడా నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.31 వేల కోట్ల సిద్ధంగా ఉన్నాయి. పోలవరానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు విడుదల చేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,444 కోట్లు రివైవల్ ప్యాకేజి కింద కేటాయించింది.

Also Read :నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

ఇలా.. బడ్జెట్‌ను సమగ్రంగా రూపొందించి.. దానిపై విస్తృత స్థాయి చర్చ జరిగే విధంగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. 24న గవర్నర్ ప్రసంగం, 25న బడ్జెట్‌ ప్రవేశ పెట్టేవిధంగా రూపకల్పన చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా బడ్జెట్ సమావేశాలను కనీసం 15 రోజులు జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మూడు వారాల పాటు నిర్వహించాలని మరికొందరు కోరుతున్నారు. అయితే, అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఎజెండాను పరిశీలించిన తరువాత అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలని అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్