తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవా?? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రాజకీయంగా ఏడాదికి పైగా కాంగ్రెస్ కు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకపోయినా ఇప్పుడు మాత్రం సొంత పార్టీలోనే అసంతృప్తి బయటపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 14 నెలల నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రచారం మొదలైంది.
Also Read : తాడేపల్లిలో వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్.. జగన్ కొత్త ప్లాన్…!
రేవంత్ రెడ్డి విషయంలో ఇబ్బందులు లేకపోయినా పార్టీలో కొంతమంది కీలక నేతల కారణంగా ఎమ్మెల్యేలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. శుక్రవారం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అయ్యారు. ఒక మంత్రి తీరుతో అసహనంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. మంత్రిని పక్కన పెట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఫిర్యాదు కూడా చేశారు.
Also Read : కేంద్ర బడ్జెట్లో హైలెట్స్ ఇవే.. స్టార్టప్‌లకు పండుగే
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలుగా అండదండలు అందించిన సదరు మంత్రి ఇప్పుడు ప్రభుత్వంలో సమస్యలకు వేదిక అవుతున్నారని కనీసం ఎమ్మెల్యేలకు కూడా విలువ ఇవ్వడం లేదని వారు రేవంత్ రెడ్డి వద్ద ఫిర్యాదు చేశారు. ఇక సమస్య తీవ్రం కావడం ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అలర్ట్ అయింది. ఎమ్మెల్యేలు అందరితో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఫోన్లో మాట్లాడి తన వద్దకు రావాలని.. తనకు సమస్య చెప్పాలని కోరారట. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం తాము కొనసాగలేకపోతున్నామని పార్టీకి రాజీనామా చేస్తామని తేల్చి చెప్పడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు సమస్య వెళ్ళినట్లు సమాచారం. మరి దీనిని ముఖ్యమంత్రి ఎలా పరిష్కరిస్తారో చూడాలి.