తెలంగాణను పదేళ్లపాటు పాలించిన భారత రాష్ట్ర సమితి లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న కొంతమంది కేటీఆర్ నాయకత్వాన్ని విభేదిస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కేటీఆర్ ఆధిపత్యాన్ని కేసీఆర్ తో కలిసి నడిచిన నాయకులు సహించడం లేదు. గులాబీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నాయకులు పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించలేదు. చేస్తే కేటీఆర్ పోరాటం చేయడం లేదంటే హరీష్ రావు అప్పుడప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా మీడియాలో కనబడుతున్నారు.
Also Read : వైసీపీలో సాయిరెడ్డి రీప్లేస్‌మెంట్..!
ముఖ్యంగా కెసిఆర్ బయటకు రాకపోవడాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోవడం లేదు. అందుకే కేటీఆర్ ను దాదాపుగా అరెస్టు చేసే పరిస్థితి వచ్చిన సరే ఆ పార్టీ నాయకత్వం బయటకు రాలేదు. అయితే ఇదే విషయంలో కేటీఆర్ కు కేసిఆర్ కు మధ్య వాగ్వాదం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని కేటీఆర్ తప్పు పట్టినట్లుగా సమాచారం. తన ఆరోగ్య పరిస్థితి ఒక కారణమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మరో కారణం తో కేసీఆర్ బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు.
Also Read : అప్పుడు ఈ-వేలం కుంభకోణం అన్నారు.. ఇప్పుడు లీజులు ఇచ్చేస్తున్నారు
గత కొన్ని రోజులుగా కేటీఆర్ పెద్దగా ఎక్కడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. అప్పుడప్పుడు మాట్లాడుతున్న గతంలో ఉన్న దూకుడు కేటీఆర్ లో కనబడలేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కెసిఆర్ బయటకు రాకపోతే పార్టీ నాశనం అయ్యే అవకాశం ఉందని ఆందోళనను కొంతమంది సీనియర్ నేతలు స్వయంగా కేసీఆర్ వద్దనే బయటపెట్టినట్లుగా సమాచారం. ఈ ఒత్తిడితోనే కేసీఆర్ తాజాగా బయటకు వచ్చి ఆ కామెంట్స్ చేశారని పార్టీ కార్యకర్తల్లో అలాగే స్థానిక నాయకత్వంలో ఉత్సాహం నింపేందుకు కేసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నాయి రాజకీయ వర్గాలు. త్వరలోనే ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాలని కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు.