ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రాజకీయంగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఈ నేపధ్యంలో తిరుమలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ విధమైన ఘటనలు చోటు చేసుకోకుండా.. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తిరుమలలో టీడీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. రథసప్తమి కి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏడు వాహనాలపై రథసప్తమి నాడు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
Also Read : టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్.. ఇవే కీలకం..!
2 నుండి 3 లక్షల మంది భక్తులు ఆరోజు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని రథసప్తమి నాడు అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసామని తెలిపారు. ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో SSD టోకన్లు జారీ నిలిపివేస్తామన్నారు. 1250 మంది పోలీసులు,1000 మంది రథసప్తమి కి భద్రత కల్పిస్తామని తెలిపారు. భక్తుల మధ్య తోపులాట్లకు తావులేకుండా ఆక్టోపస్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఏపిఎస్పీ, అగ్నిమాపక దళాలు పనిచేస్తారని పేర్కొన్నారు.
Also Read : జగన్.. ఈ సారి కూడా మడమ తిప్పుతున్నాడా..?
వాహనసేవలను తిలకించేందుకు గ్యాలరీల్లో వేచిఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు పంపిణీ చేస్తామని పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలతో తిరుమల ముస్తాబు చేస్తున్నామన్నారు. 8 లక్షల లడ్డూలు నిల్వ చేసామని తిరుపతిలో జనవరి 8న దురదృష్ట ఘటనను దృష్టిలో పెట్టుకొని…రథసప్తమి నాడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొకుండా సామాన్యభక్తులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. మహాకుంభామేళా ప్రయాగ్ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయం అద్భుతంగా ఉందన్నారు. రోజుకు 10 వేల మంది భక్తులకు దర్శించుకుంటున్నారని తెలిపారు. తిరుమల తరహాలో అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నామన్నారు.