ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. గత అయిదేళ్ళు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఒక్క అడుగు కూడా పడకపోవడం.. ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విషయంలో స్వయంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో అధికారులు కూడా సీరియస్ గానే కష్టపడుతున్నారు. కీలకమైన డయాఫ్రం వాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది.
Also Read : క్రెడిట్ కోసం వైసీపీ పాట్లు..!
ఇక పోలవరం ప్రాజెక్టుకు విదేశీ నిపుణులు బృందం మళ్లీ రాబోతున్నారట. ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు వీరు పోలవరంలో పర్యటించనున్నారు.తొలిరోజు ఫిబ్రవరి 1న డి వాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఈ బృందం సభ్యుల్లో ఇద్దరు డి సిస్కో డేవిడ్ బి పాల్ నేరుగా ప్రాజెక్టు వద్దకు రాగా మరో ఇద్దరు విదేశాల నుంచి చర్చల్లో ఆన్లైన్ విధానంలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్లాస్టిక్ కాంక్రీటు పనులు,ఇతర పనులు పర్యవేక్షించి ఇందుకు తగ్గట్టుగా నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు అధ్యయనం చేయనున్నారు.
Also Read : ఢిల్లీ ఎన్నికల్లో యమునా పాలిట్రిక్స్..!
కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, పోలవరం అధికారులు, మేఘా, బావర్ కంపెనీ ప్రతినిధులతో చర్చించనున్నారు. షెడ్యూలు ప్రకారం డి వాల్ నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు అవసర మైన విధంగా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయా? మెటీ రియల్, యంత్రసామగ్రి అంశాలను పరిశీలించి అవసరమైన సలహాలు ఇవ్వనున్నారు. ఎప్పటికప్పుడు పని నాణ్యతను తేల్చేందుకు నిర్వహిస్తున్న పరీక్షలు, అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలను విదేశీ నిపుణులు ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. ఎగువ కాఫర్ డ్యాం గర్భం వద్ద లీకేజీలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఈ చర్చల్లో ఉండనున్నాయి.