రాజమౌళి సినిమాల్లో ఛాన్సుల కోసం ఇతర భాషల యాక్టర్స్ కూడా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో అవకాశాల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. విలన్ పాత్ర రాజమౌళి ఎవరికి ఇస్తాడు అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే మలయాళ స్టార్ యాక్టర్ పృధ్విరాజ్ సుకుమారన్ కు విలన్ పాత్ర ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ ఈ పాత్ర కోసం గట్టిగానే కష్టపడుతున్నట్లు మలయాళం మీడియా కూడా రాసుకొచ్చింది.
Also Read : పెద్దిరెడ్డిపై పవన్ కళ్యాణ్ గురి
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అతను తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. పృథ్విరాజ్ స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రెమ్యూనరేషన్ విషయంలోనే పృథ్వీరాజ్ వెనక్కు తగ్గాడని, భారీగా డిమాండ్ చేయడంతో.. అందుకు నిర్మాతలు ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదని సమాచారం. ముందు నుంచి మలయాళ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాలో అతనిని తీసుకుంటే ప్లస్ అవుతుందని ప్లాన్ చేశాడు. కానీ రెమ్యూనరేషన్ విషయంలో సెట్ కాకపోవడంతో ఈ స్టార్ యాక్టర్ సైడ్ అయిపోయాడు.
Also Read : నేను వస్తున్నా.. పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్
ఇక జాన్ అబ్రహం అతనికంటే తక్కువ అడగడంతో అతనిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియంకా చోప్రాను ఆల్మోస్ట్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూవీ యూనిట్ మొత్తం కెన్యా బయలుదేరి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో అక్కడే నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాను వచ్చేయేడాది సంక్రాంతికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు.