తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉందనే దానిపై క్లారిటీ రావడం లేదు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని గ్రామాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఎదురుచూస్తూ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు నేతలు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గెలవాలని గ్రామాల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వర్కౌట్ మొదలుపెట్టారు.
Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని విషయంలో కీలక నిర్ణయానికి వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు వెలువడ్డాయి. సర్పంచ్ ఎన్నికల నిమిత్తం సంబంధిత పంచాయతీరాజ్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో ఎన్నికల కార్యాచరణ పై చర్చించి.. నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి పంపిస్తే ఎన్నికల సంఘం తేదీలను ఖరారు చేయనుంది.
Also Read : గల్లా జయదేవ్ కి రాజ్య సభ సీటు దక్కేనా?
ఈ ప్రక్రియ అంతా ఫిబ్రవరి నెలలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలతో పాటుగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు జనవరి 26న ప్రారంభమయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు ఇదే సరైన సమయం కావచ్చని ఎమ్మెల్యేలు కూడా అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావడంతో రేవంత్ పాలనపై కొంతమేర వ్యతిరేకత వస్తుందననే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకే పథకాలు విడుదల చేసిన వెంటనే ఎన్నికల నిర్వహిస్తే లబ్ధిదారుల ఓట్లను క్యాష్ చేసుకోవచ్చనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.