Tuesday, October 28, 2025 02:22 AM
Tuesday, October 28, 2025 02:22 AM
roots

చిరంజీవికి రామ్ చరణ్ రిక్వస్ట్.. తండ్రిని టార్గెట్ చేయడంతో జాగ్రత్తలు…!

గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇబ్బంది పడుతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఒకటంటే ఒక్క హిట్ కూడా లేదు. రెండు సినిమాలు చేస్తే రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే ఆ సినిమా క్రెడిట్ లో ఎన్టీఆర్ కూడా భాగం కాబట్టి.. ఆ క్రెడిట్ మొత్తం రాంచరణ్ కు రాదు. కాబట్టి రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ కు సోలోగా ఒక హిట్ కూడా లేదు. దీనితో ఇప్పుడు బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.

Also Read : వైసీపీలో లోఫర్లు ఎక్కువ.. జగన్ పై వసంత సంచలన కామెంట్స్

ఎన్టీఆర్ చేయాల్సిన కథ తీసుకుని సినిమా చేస్తున్న రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ విషయంలో.. తన తండ్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ఆచార్య సినిమాను చిరంజీవి డైరెక్ట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొరటాల శివ కూడా ఇన్ డైరెక్టుగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా చిరంజీవి జోక్యం చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అందుకే సినిమాను డైరెక్టర్ శంకర్ అనుకున్న విధంగా చేయలేకపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

Also Read : ఇదేందయ్యా… వదిన అలా.. మరిది ఇలా..!

దీనిపై మెగా ఫాన్స్ కూడా అసహనం వ్యక్తం చేశారు. దీనితో ఈ సినిమా విషయంలో చిరంజీవిని పక్కన పెట్టాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యాడట. అనవసరంగా తన తండ్రిని బ్లేమ్ చేయడంతో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దు అని కోరినట్లు సమాచారం. అందుకే మైసూర్లో షూటింగ్ జరిగినా… హైదరాబాదులో షూటింగ్ జరిగినా చిరంజీవి షూటింగ్ స్పాట్ కు రావటం లేదట. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్