Monday, October 27, 2025 10:44 PM
Monday, October 27, 2025 10:44 PM
roots

తులసి బాబుపై టీడీపీ సంచలన ప్రకటన

కృష్ణాజిల్లా టిడిపిలో కామేపల్లి తులసిబాబు వ్యవహారం సంచలనవుతుంది. రఘురామకృష్ణంరాజును కస్టడీలో టార్చర్ చేసిన వ్యవహారంలో తులసి బాబు కీలకంగా ఉండటంతో అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు కోర్టు మూడు రోజులపాటు తులసి బాబుని విచారించేందుకు అనుమతి ఇవ్వడంతో ఒంగోలు పోలీసులు కీలక విచారణ జరుపుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో టిడిపి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. తులసి బాబుని అరెస్టు చేసిన తర్వాత… వెంటనే వెనిగండ్ల రాము ఒంగోలు వెళ్లడం అక్కడ హడావిడి చేయడం తీవ్ర వివాదాస్పదమైంది.

Also Read : సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబు సంచలన కామెంట్స్

దీనిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా మండిపడింది. ఇక తాజాగా దీనిపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. గుడివాడలో కామేపల్లి తులసి బాబుకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఆయన ప్రకటించారు. రఘురామకృష్ణం రాజు పై కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఇప్పటికే అరెస్టు అయి గుంటూరు జైల్లో ఉన్న తులసి బాబుతో టిడిపి నేతలకు ఏ విధమైన సంబంధాలు లేవని.. గుడివాడలో ఎమ్మెల్యే రాము అనుచరుడుగా సమాంతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు నిజం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Also Read : గద్దర్ కు పద్మ అవార్డా..? బాంబు పేల్చిన బండి

తులసి బాబు విషయంలో అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అపార్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు ప్రకారం తన గుండెల పై కూర్చుని హత్యాయత్నానికి తులసి బాబు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం తులసి బాబు మూడు రోజుల పోలీస్ కస్టడీలో ఉండగా నిన్న సాయంత్రం ఆయనను దాదాపు గంటన్నర పాటు విచారించారు పోలీసులు. ఇక ఈ విచారణ మంగళవారం కూడా కొనసాగుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్